అక్టోబరు 1 (ప్రజా వీక్షణం:
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని నమీబియా క్రికెటర్ డేవిడ్ వీస్ మరోసారి నిరూపించాడు. 41 ఏళ్ల వయసులో తన కెరీర్‌లో తొలి హ్యాట్రిక్ నమోదు చేసి ఆకట్టుకున్నాడు. కెనడా సూపర్ 60 లీగ్‌లో వైట్ రాక్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అరుదైన ఘనత సాధించాడు.
వరుస బంతుల్లో మూడు వికెట్లు
వైట్ రాక్ వారియర్స్ ఇన్నింగ్స్‌లో 9వ ఓవర్ వేసిన వీస్.. వరుస బంతుల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. తొలుత ప్రమాదకరంగా కనిపించిన డ్వేన్ ప్రిటోరియస్‌ను ఔట్ చేసిన అతడు.. ఆ తర్వాత శివమ్ శర్మ, సుఖ్‌జిందర్ సింగ్‌లను వరుస బంతుల్లో పెవిలియన్‌కు పంపించాడు. దీంతో తన క్రికెట్ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు.
టీ20ల్లో వీస్ అనుభవం
కెనడా సూపర్ 60 లీగ్‌కు ముందు యూరోపియన్ టీ20 ప్రీమియర్ లీగ్‌లోనూ వీస్ సత్తా చాటాడు. రోటర్‌డామ్ డాకర్స్ తరఫున 10 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు పడగొట్టాడు. 2024 జూన్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన వీస్.. ప్రస్తుతం వివిధ టీ20 ఫ్రాంచైజీ లీగ్‌లలో కొనసాగుతున్నాడు.
పొట్టి ఫార్మాట్‌లో భారీ రికార్డు
వీస్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 15 వన్డేలు, 54 టీ20లు ఆడి 74 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో నాలుగు అర్ధశతకాలు నమోదు చేశాడు. అయితే టీ20 ఫార్మాట్‌లో అతడికి సుదీర్ఘ అనుభవం ఉంది. ఇప్పటివరకు 434 టీ20 మ్యాచ్‌లు ఆడిన వీస్.. 358 వికెట్లతో పాటు 4,734 పరుగులు సాధించాడు. 41 ఏళ్ల వయసులోనూ ఫ్రాంచైజీ క్రికెట్‌లో తనదైన ముద్ర వేస్తున్నాడు.












