రెడ్‌మీ 17సీ 5జీ విడుదల.. ధర రూ.20,999

అక్టోబరు 1 ప్రజా వీక్షణం):

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్‌ రెడ్‌మీ భారత్‌లో కొత్త 17సీ 5జీ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ 17 సిరీస్‌లో ఇది రెండో ఫోన్‌గా మార్కెట్లోకి వచ్చింది. భారీ బ్యాటరీ, 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌ డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా దీని ప్రత్యేకతలు. అక్టోబరు 7 నుంచి అమెజాన్‌, షావోమీ ఆన్‌లైన్‌ స్టోర్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
రెండు వేరియంట్లలో..
రెడ్‌మీ 17సీ 5జీ ప్రారంభ ధరను రూ.20,999గా నిర్ణయించారు. ఈ ధరకు 4జీబీ ర్యామ్‌, 128జీబీ నిల్వ సామర్థ్యం ఉన్న వేరియంట్‌ లభిస్తుంది. 6జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ మోడల్‌ ధర రూ.22,999గా ఉంది. కాఫీ బ్రూ, డార్క్‌ నైట్‌, పర్పుల్‌ డాన్‌ రంగుల్లో ఫోన్‌ అందుబాటులో ఉంటుంది.
భారీ డిస్‌ప్లే.. 50MP కెమెరా
ఫోన్‌లో 6.9 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. ఇది 120 హెర్ట్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, గరిష్ఠంగా 810 నిట్స్‌ ప్రకాశాన్ని అందిస్తుంది. మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హైపర్‌ఓఎస్‌ 3పై నడుస్తుంది. వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ ప్రధాన కెమెరా, ముందు 8 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
6,000mAh బ్యాటరీ
రెడ్‌మీ 17సీ 5జీలో 6,000ఎంఏహెచ్‌ బ్యాటరీని అమర్చారు. ఇది 33 వాట్ల వేగవంతమైన ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం ఐపీ64 రేటింగ్‌ ఉంది. 5జీ, 4జీ ఎల్‌టీఈ, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై, బ్లూటూత్‌ 5.4, యూఎస్‌బీ టైప్‌-సీ కనెక్టివిటీ వంటి సదుపాయాలు ఉన్నాయి.

error: Content is protected !!
Prajaveek Shanam