అక్టోబరు 1 (ప్రజా వీక్షణం):
దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన పసిడి ధర.. నేడు మళ్లీ కొంత తగ్గింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బంగారం ధరల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
హైదరాబాద్లో ఎంతంటే?
గుడ్ రిటర్న్స్ వివరాల ప్రకారం.. ఉదయం 10.30 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 తగ్గి రూ.1,49,240కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,36,800గా ఉంది. 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,930గా నమోదైంది. నగరంలో కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా కొనసాగుతోంది.
తెలంగాణలో ధరలు
వరంగల్, నిజామాబాద్, ఖమ్మం నగరాల్లోనూ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,49,240, 22 క్యారెట్ల పసిడి రూ.1,36,800, 18 క్యారెట్ల బంగారం రూ.1,11,930గా ఉంది.
ఏపీలోనూ ఇవే ధరలు
విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, కాకినాడ, తిరుపతి నగరాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.1,49,240గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,36,800గా, 18 క్యారెట్ల బంగారం రూ.1,11,930గా నమోదైంది.
ప్రధాన నగరాల్లో ధరలు
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,240, 22 క్యారెట్ల ధర రూ.1,36,800, 18 క్యారెట్ల ధర రూ.1,14,500గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల ధర రూ.1,49,390, 22 క్యారెట్ల ధర రూ.1,36,950, 18 క్యారెట్ల ధర రూ.1,12,080గా నమోదైంది. వడోదరాలో 24 క్యారెట్ల బంగారం రూ.1,49,290, 22 క్యారెట్ల ధర రూ.1,36,850, 18 క్యారెట్ల ధర రూ.1,11,980గా ఉంది. ముంబై, కోల్కతా, బెంగళూరు, కేరళ, పుణెలో హైదరాబాద్ ధరలే కొనసాగుతున్నాయి.












