ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు
కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి
అక్టోబర్ 5: (ప్రజా వీక్షణం ప్రతి నిధి)
ఎల్‌నినో ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో జిల్లాలో కరువు పరిస్థితులను అంచనా వేసి కరువు మండలాలను ప్రకటించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఈ మేరకు సోమవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. కాకాణి గోవర్ధన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్సీ, నెల్లూరు సిటీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ బూదూరు గురవయ్య, జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని, దీనివల్ల వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రైతులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారని, వర్షాలు సకాలంలో కురవకపోతే పంటల సాగు, దిగుబడులపై ప్రభావం పడుతుందని తెలిపారు.జిల్లాలో మండలాల వారీగా వర్షపాతం, సాగు విస్తీర్ణం, పంటల పరిస్థితి, రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ప్రాంతాలను గుర్తించి నిబంధనల ప్రకారం కరువు మండలాలను ప్రకటించాలని అన్నారు.రైతులు తీవ్రంగా నష్టపోయిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందుగానే పరిస్థితులను అంచనా వేసి ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని కాకాణి కోరారు. కరువు ప్రభావిత ప్రాంతాల్లో రైతులకు అవసరమైన సహాయ, ఉపశమన చర్యలు అందించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో నెలకొన్న పరిస్థితులపై అధికారులు సమగ్ర నివేదిక రూపొందించి ప్రభుత్వానికి పంపాలని, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని అన్నారు. కరువు మండలాల ప్రకటనతో పాటు రైతులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి, బూదూరు గురవయ్యతో పాటు నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.












