రోడ్డు ప్రమాద బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

చిల్లకూరు: (ప్రజా వీక్షణం)  అక్టోబర్ 08

మండలంలోని తీపనూరు పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త గుంటపూడి సాయికృష్ణ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. విషయం తెలుసుకున్న గూడూరు ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్‌కుమార్ ఆయన కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహాయాన్ని లైవ్‌స్టాక్ డైరెక్టర్ గుండాల లీలావతి, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు చిట్టేటి కీరవాణి తదితరులు సాయికృష్ణ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam