పూర్వ విద్యార్థుల చేయూతతో క్రీడా పరికరాల వితరణ

గూడూరు: (ప్రజా వీక్షణం)అక్టోబర్ 08

స్థానిక ఎస్‌.కె.ఆర్‌. డిగ్రీ కళాశాలకు 1983–86 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.30 వేల విలువైన క్రీడా పరికరాలను వితరణగా అందజేశారు. ఈ పరికరాలను కళాశాల ప్రిన్సిపల్ రాంప్రసాద్‌కు పూర్వ విద్యార్థులు అందించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. కళాశాలలో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థ అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. విద్యార్థుల క్రీడా ప్రతిభను ప్రోత్సహించేందుకు క్రీడా పరికరాలను అందించడం సంతోషకరమన్నారు. విద్యార్థులు ఈ పరికరాలను సద్వినియోగం చేసుకుని క్రీడల్లో ప్రతిభ కనబరిచి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి నాగేంద్రప్రసాద్, ఫిజికల్ డైరెక్టర్ అమ్మాజీ, పూర్వ విద్యార్థులు శరత్‌బాబు, శ్రీధర్‌రెడ్డి, మనోహర్‌రావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam