ఎన్నికల సంఘంపై ప్రజలకు విశ్వాసం పెంచాలి: కాంగ్రెస్ నాయకులు
గూడూరు: అక్టోబర్.08
ఎన్నికల సంఘం నుంచి ఓటర్ల జాబితాలకు సంబంధించిన సమాచారాన్ని వెల్లడించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గూడూరు టవర్ క్లాక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.ఇండియా కూటమి నాయకులు శాంతియుతంగా నిరసన చేపట్టిన సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ఎంపీలపై పోలీసులు దురుసుగా వ్యవహరించి లాఠీచార్జ్ చేయడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులపై దాడి చేయడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.భారత జాతీయ కాంగ్రెస్ ఈ ఘటనకు నిరసనగా ఈ రోజును ‘బ్లాక్ డే’గా ప్రకటించిందని నాయకులు తెలిపారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం కలిగేలా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని వారు కోరారు.ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గూడూరు నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రామకృష్ణయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి వేమయ్య, రాష్ట్ర ఇంటక్ అధ్యక్షుడు పూల చంద్రశేఖర్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు షేక్ నాయుకల ఫయాజ్, రాష్ట్ర కాంగ్రెస్ బీసీ విభాగం కార్యదర్శి రావూరి బ్రహ్మయ్య, జిల్లా కాంగ్రెస్ బీసీ విభాగం కార్యదర్శి గుంటమడుగు సుబరామరాజు, గూడూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సుబ్బారావు, యువజన కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్, ముత్తుకూరు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అంకయ్య, ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంటా శ్రీనివాసులు రెడ్డి, మూర్తి తదితరులు పాల్గొన్నారు.












