వెంకటగిరి, అక్టోబర్ 8
నవజీవన్ ఆర్గనైజేషన్, తిరుపతి టాటా క్యాన్సర్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గురువారం ఉదయం గ.9.30 లకు వెంకటగిరి లోని నవజీవన్ ఆర్గనైజేషన్ కార్యాలయం ప్రాంగణంలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.యం. హెచ్.ఓ డా. సి.హెచ్. హరిత, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఆఫీసర్ -డా. యన్. తులసీదాసు, ఎక్జిక్యూటివ్ సెక్రటరీ,జిల్లా పి. సి అండ్ పి. యన్. డి. టీ యాక్ట్ సభ్యులు కె.వి. రమణ, టాటా క్యాన్సర్ హాస్పిటల్ ప్రోగ్రాం మేనేజర్ పి.వి హేమంత్ కుమార్, నవజీవన్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కె. సహదేవయ్య, ప్రాజెక్టు డైరెక్టర్ కె. విక్టోరియా, సంస్థ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉచితంగా ఓరల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ మరియుసాధారణ వైద్య సేవలు డాక్టర్ రాజేష్ , డాక్టర్ సత్యప్రియ, టాటా క్యాన్సర్ హాస్పిటల్ వైద్య బృందం పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో 200 మంది సాధారణ ప్రజలు పాల్గొని ఈ సేవలు వినియోగించుకోవడం జరిగింది. ముఖ్య అతిథులు మాట్లాడుతూ పాల్గొన్నవారు, నవజీవన్ ఆర్గనైజేషన్ గత 30 సంవత్సరాలుగా ప్రజలుకు అందిస్తున్న సేవలు అమోఘమని వారు కొనియాడారు.












