నూతన ఈవో చిట్టిబాబును మర్యాదపూర్వకంగా కలిసిన పేపళ్ల అమరయ్య నాయుడు

గూడూరు: గూడూరు పట్టణంలోని పలు దేవాలయాలకు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారిగా (ఈవో) నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చిట్టిబాబును, గూడూరు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడు పేపళ్ల అమరయ్య నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకులు, స్వీపర్లకు జీతాల చెల్లింపులు, దేవస్థాన అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహకారం అందించడం తదితర అంశాలపై ఈవోతో చర్చించారు. రాబోయే డిసెంబర్ నెలలో జరిగే ముక్కోటి ఉత్సవాలు, నూతన సంవత్సర సందర్భంగా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని కోరారు.

దేవస్థాన అభివృద్ధికి ధర్మకర్తల మండలి తరఫున ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందిస్తామని పేపళ్ల అమరయ్య నాయుడు తెలిపారు. దేవస్థాన నిర్వహణ, భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యాలు కల్పించడం వంటి పలు అంశాలపై ఈవోతో చర్చించారు.

error: Content is protected !!
Prajaveek Shanam