గూడూరు: ప్రజా వీక్షణం అక్టోబర్ 12
గూడూరు పట్టణ అభివృద్ధిలో భాగంగా కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.30 కోట్ల నిధులతో వివిధ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు నిర్వహించారు. గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు.పట్టణంలోని గాంధీనగర్, నాయి బ్రాహ్మణ కాలనీ, ప్రశాంత్ నగర్, దండోరా కాలనీ, పాత గాంధీనగర్ తదితర ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి స్థానిక పురపాలక సంఘం కమిషనర్ చేతుల మీదుగా శంకుస్థాపనలు నిర్వహించారు. ఈ పనులు పూర్తయితే ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకల్లో సౌకర్యం కలగనుంది.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏసుపాకు పెంచలయ్య, శ్రీపాదం ఉదయ్ కుమార్, సీనయ్య తదితరులు పాల్గొన్నారు.












