గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలి – ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్
గొల్లపల్లి, కొమ్మనేటూరు,కందలి, చెమిర్ధి, సెగ్మెంట్లలో ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులతో కలిసి ఇంటింటి ప్రచారం
గూడూరు: (ప్రజా వీక్షణం)అక్టోబర్. 31
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తించాలని, రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులను గెలిపించాలని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారాలను నమ్మకుండా వాస్తవాలను పరిశీలించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు.గూడూరు మండలంలోని గొల్లపల్లి, కొమ్మనేటూరు, కందలి, సెగ్మెంట్లలో ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థితో కలిసి ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ విస్తృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా గ్రామాలకు చేరుకున్న ఎమ్మెల్యేకు స్థానిక తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అభ్యర్థులతో కలిసి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామీణ ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను తాము మర్చిపోలేమని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.అనంతరం ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని గుర్తు చేశారు. రహదారులు, తాగునీరు, మౌలిక సదుపాయాలు, గ్రామీణాభివృద్ధి వంటి అంశాలకు అప్పటి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అయితే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని విమర్శించారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో గత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడమే లక్ష్యంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తున్నామని వివరించారు.గ్రామాల అభివృద్ధి అనేది కేవలం ప్రభుత్వంతోనే సాధ్యం కాదని, స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు కూడా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే గ్రామాల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు మరింత అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలు, గ్రామాల ప్రాధాన్యతలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు కూటమి నాయకులు కృషి చేస్తారని హామీ ఇచ్చాప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా చేస్తున్న ప్రచారాలను విశ్వసించవద్దని, గత పాలనకు ప్రస్తుత పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే కోరారు. అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు తమ విలువైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఎమ్మెల్యే పర్యటనతో ఆయా గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగింది. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ఇంటింటి ప్రచారం సందర్భంగా ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థి తదితరులు పాల్గొన్నారు.










