కాండ్రలో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి రూపకళ విస్తృత ప్రచారం

గూడూరు, నవంబర్ 1 : ప్రజా వీక్షణం

గూడూరు మండలం మేకనూరు ఎంపీటీసీ సెగ్మెంట్ పరిధిలోని కాండ్ర గ్రామంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఉగ్గుమూడి రూపకళ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కాండ్ర రవిరాజు ఆధ్వర్యంలో ఆదివారం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా అభ్యర్థి రూపకళ మాట్లాడుతూ, మేకనూరు సెగ్మెంట్ నుంచి వైఎస్ఆర్సీపీ తరపున తాను పోటీ చేస్తున్నానని, ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.వైఎస్ఆర్సీపీ నాయకులు కాండ్ర రవిరాజు మాట్లాడుతూ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన హామీలను విఫలం చేసిందని, సంక్షేమ పథకాల అమలు సరిగా లేదని ప్రజలే చెబుతున్నారని అన్నారు. అందుకే తమ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam