బూదనంలో జనసేన–టీడీపీ నాయకుల విస్తృత ఇంటింటి ప్రచారం
నెలబల్లి–రెట్టపల్లి ఎంపీటీసీ అభ్యర్థి మేకల శ్రీలతకు మద్దతుగా ప్రచారం
గూడూరు: ప్రజా వీక్షణం నవంబర్1
నెలబల్లి–రెట్టపల్లి ఎంపీటీసీ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ మద్దతుతో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి శ్రీమతి మేకల శ్రీలతకు మద్దతుగా ఆదివారం బూదనం గ్రామంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు సంయుక్తంగా ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక సంస్థల ఎన్నికల జనసేన పార్టీ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త తీగల చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, పంచాయతీల బలోపేతం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. గ్రామాల్లో రహదారులు, తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర సమస్యల పరిష్కారానికి కూటమి బలపరిచిన శ్రీలతను గెలిపించాలని కోరారు.కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ముందుకు సాగుతూ అభ్యర్థికి మద్దతు తెలియజేయాలని, ఎన్నికల్లో మేకల శ్రీలతకు కేటాయించిన గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి తమ మద్దతు తెలియజేయాలని గ్రామ ప్రజలను అభ్యర్థించారు.అనంతరం ఎంపీటీసీ అభ్యర్థి శ్రీమతి మేకల శ్రీలత మాట్లాడుతూ, జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో పాటు గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ గారి ప్రోత్సాహం, తానంకి నానాజీ ఆశీస్సులు, టిడిపి నాయకుల ఆశీస్సులు, మద్దతుతో నెలబల్లి–రెట్టపల్లి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని తెలిపారు. ప్రజలు తనకు అవకాశం కల్పిస్తే గ్రామంలోని ప్రతి సమస్యను తెలుసుకుని, వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామ అభివృద్ధికి బాధ్యతాయుతంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. తనకు ప్రజల ఆశీర్వాదాలు, మద్దతు అందించాలని కోరారు.ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కె. మోహన్, జనసేన నాయకులు బసవనూరు భాస్కర్, అక్బర్, జడ సురేష్ కుమార్, అనిల్, మస్తాన్, మౌలా, హెమ్ , చైతన్య, రవి, పోలయ్య జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










