వల్లిపేడు సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ విస్తృత ప్రచారం

టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బండి విజయలక్ష్మికి మద్దతుగా ఇంటింటి ప్రచారం

చిల్లకూరు, నవంబర్ 1: ప్రజా వీక్షణం

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా చిల్లకూరు మండలం వల్లిపేడు ఎంపీటీసీ సెగ్మెంట్‌లో ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశం సునీల్ కుమార్ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి బండి విజయలక్ష్మికి మద్దతుగా ప్రజలను కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ.. సైకిల్ గుర్తుపై ఓటు వేసి బండి విజయలక్ష్మిని గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రామాల అభివృద్ధి కొనసాగాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులకు ప్రజలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో గ్రామాల్లో మరింత అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam