తిరుపతి: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SV యూనివర్సిటీ)లో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “నాటి నుంచి నేటి వరకు సినీ సంగీత పాటల విభావరి” కార్యక్రమం ఘనంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంగా పాట పాడి అందరినీ అలరించారు. కార్యక్రమంలో సినీ సంగీతానికి సంబంధించిన పాత మరియు కొత్త పాటలను ప్రదర్శిస్తూ కళాకారులు తమ ప్రతిభను చూపించారు. సంగీత ప్రియులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని ఆస్వాదించారు.
ఈ విభావరి కార్యక్రమం ద్వారా తెలుగు సినీ సంగీత సంప్రదాయాన్ని కొత్త తరానికి పరిచయం చేయడం లక్ష్యంగా నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమం అంతా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది.












