కర్నూలులో పెళ్లి వేడుకకు వచ్చి తుంగభద్ర నదిలో స్నానానికి దిగి నలుగురు మృతి

కర్నూలు జిల్లా కోసిగి ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద తుంగభద్ర నదిలో స్నానానికి దిగి, నలుగురు మృతి చెందారు. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు కర్ణాటకలోని మాన్వికి చెందిన 15 మంది 2 రోజుల క్రితం కందుకూరు గ్రామానికి వచ్చారు. వివాహం ముగిసిన తర్వాత శుక్రవారం ఉదయం తుంగభద్ర నదిలో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈత రాక నలుగురు నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారని సమాచారం•

error: Content is protected !!
Prajaveek Shanam