పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకం తగ్గింపు – ప్రజలకు ఊరటనిచ్చిన నిర్ణయం: పవన్ కళ్యాణ్

పెరుగుతున్న ఇంధన ధరల ప్రభావం మధ్య తీసుకున్న ఈ నిర్ణయం సాధారణ ప్రజలపై భారం తగ్గించే దిశగా కీలకమని పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంపై పడుతున్న నేపథ్యంలో, దేశంలో ధరల నియంత్రణకు ఈ చర్య ఉపశమనాన్ని కలిగిస్తుందని తెలిపారు.పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని రూ. 10 వరకు తగ్గించడం, డీజిల్‌పై ఉన్న సుంకాన్ని పూర్తిగా రద్దు చేయడం ద్వారా వినియోగదారులకు నేరుగా ప్రయోజనం చేకూరుతుందని ఆయన అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న సమయంలో సరఫరా అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం వంటి చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల సాధారణ ప్రజలతో పాటు రవాణా, వ్యవసాయం, పరిశ్రమల రంగాలకు కూడా ఉపశమనం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల నియంత్రణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam