తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక తెలుగుదేశం పార్టీ – గండవరం సుష్మా రెడ్డి

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా, పేద ప్రజల పక్షపాతిగా నిలిచిన తెలుగుదేశం పార్టీ అని ఆ పార్టీ నాయకురాలు గండవరం సుష్మా రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామంలో ఆదివారం తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
గూడూరు ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు, మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి అధ్యక్షతన, గండవరం సుష్మా రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ నాయకుడు వరాల బాలాజీ మరియు ఆయన బృందం వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా గండవరం సుష్మా రెడ్డి, ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, స్వీట్లు మరియు పండ్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు.
మాట్లాడిన సుష్మా రెడ్డి, తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని తెలిపారు. సినిమా రంగంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, నాటి కాంగ్రెస్ పాలనకు ముగింపు పలకడమే లక్ష్యంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు.
ఎన్టీఆర్ రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలో కూడా విశేష కీర్తి సాధించి, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని పేర్కొన్నారు. పేదల సంక్షేమం కోసం మహిళలకు ఆస్తిలో హక్కు, రెండు రూపాయలకు కిలో బియ్యం వంటి పథకాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మర్రి అనిల్, సులూరు విజయ్ కుమార్, వరాల సాంబ శివరావ్, నులక కోటయ్య, హరి, అశోక్, చిరంజీవి, పోలయ్య కోటయ్య, మధు, వాసు వెంకటయ్య, కోటేశ్వరరావు తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam