తిక్కవరం లో ఘనంగా టిడిపి 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

గూడూరు నియోజకవర్గం – చిల్లకూరు మండలం వార్త

చిల్లకూరు మండలం తిక్కవరం గ్రామ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం గూడూరు శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు మాజీ పెంచలకోన ట్రస్ట్ బోర్డు చైర్మన్ తానంకి నానాజీ గారి సూచనలతో నిర్వహించబడింది. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పార్టీ జెండా ఆవిష్కరించి, పార్టీ స్థాపన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో తిక్కవరం గ్రామ సర్పంచ్ ఒడూరు సతీష్ రెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు మందపాటి లింగారెడ్డి, ఉప సర్పంచ్ ఆవుల ప్రభాకర్, బూత్ కన్వీనర్ వాదినాల శ్రీను, ఎస్సీ సెల్ అధ్యక్షులు గడ్డం శ్రీను, ఐటీడీపీ నాయకులు విక్రమ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే దువ్వూరు నారాయణ రెడ్డి, సుబ్రహ్మణ్యం రెడ్డి, ముని చంద్రారెడ్డి, శ్రీహరి, వినోద్ చంటి, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు కరుణాకర్, పిగిలాం మహేష్, శివకుమార్, రాధాకృష్ణరెడ్డి తదితర నాయకులు మరియు తిక్కవరం, యోగీశ్వరునిపల్లి గ్రామాలకు చెందిన పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ,
, తెలుగుదేశం పార్టీ స్థాపన నుండి ఇప్పటి వరకు ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ, పేద ప్రజల అభ్యున్నతికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన పార్టీగా టిడిపి ప్రత్యేక స్థానం సంపాదించిందన్నారు.ప్రస్తుతం కూడా పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లడం ప్రతి కార్యకర్త బాధ్యత అని, గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేస్తే రాబోయే రోజుల్లో పార్టీకి మరింత ప్రజాభిమానాన్ని సంపాదించగలమని విశ్వాసం వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam