చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే, మునిసిపల్ కమీషనర్ గారికి ధన్యవాదాలు

గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల సందర్భం గా క్రైస్తవ బరియల్ గ్రౌండ్ ను క్లీన్ చేయించేందుకు చర్యలు తీసుకున్న ఎమ్మెల్యే, మునిసిపల్ కమీషనర్ గారికి ధన్యవాదాలు*
*గూడూరు టౌన్ & రూరల్ పాస్టర్స్ అసోసియేషన్*
రాబోవు గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగల సందర్భం గా క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ లోముళ్ల చెట్లు పెరిగిపోయి అస్తవ్యస్తoగా ఉండగా, ఈ విషయమై గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ సభ్యులు వారం క్రితం ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు మునిసిపల్ కమీషనర్ గారిని జెసిబి తో బరియల్ గ్రౌండ్ ను క్లీన్ చేయించమని ఆదేశించడం జరిగింది. కమీషనర్ గారు గత రెండు రోజులు గా జెసిబి ని పంపించి క్లీన్ చేయించడం జరిగింది.
సమస్య చెప్పగానే వెంటనే స్పందించి బరియల్ గ్రౌండ్ క్లీన్ చేయించేందుకు చర్యలు తీసుకున్న మా ప్రియతమ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పాశిo సునీల్ కుమార్ గారికి, మునిసిపల్ కమీషనర్ వెంకటేశ్వర్లు గారికి మా గూడూరు క్రైస్తవ సోదర,, సోదరీ ల పక్షమున, గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ తరపున హృదయపూర్వకంగా దేవుని నామమున వందనాలు తెలియచేయుచున్నామని గూడూరు మాజీ కౌన్సిలర్ మరియు టీడీపీ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు టి . ఇశ్రాయేల్ కుమార్, గూడూరు టౌన్ అండ్ రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బక్కా రత్న శేఖర్, సెక్రటరీ వేల్పుల ప్రభుదాస్, పాస్టర్ ధన్యాసి విజయకుమార్, బరియల్ గ్రౌండ్ ఇంచార్జ్ పాస్టర్ కిషోర్ కుమార్ లు పేర్కొన్నారు.













