గ్రామ అభివృద్ధి – సంక్షేమం కలసి: సిసి రోడ్ శంకుస్థాపనతో పాటు పెన్షన్ పంపిణీ

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్పష్టం చేశారు. గెలిచిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రధాన హామీలలో భాగంగా పెన్షన్లను పెంచి, ప్రతి నెలా సమయానికి లబ్ధిదారులకు అందజేస్తున్నామని ఆయన తెలిపారు.నెల్లూరు జిల్లా గూడూరు మండలం మంగళ పూరు గ్రామంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికి సభను ఉత్సాహంగా మార్చారు. కార్యక్రమం ప్రారంభంలో ఎమ్మెల్యే పార్టీ జెండాను ఎగురవేసి, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అదే సందర్భంగా గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసి, గ్రామ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహించి, ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ సమస్యలను, అభ్యర్థనలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు.తదుపరి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన లబ్ధిదారులకు పెంచిన పెన్షన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “గెలిచిన మొదటి నెల నుంచే పెన్షన్లను పెంచి, ప్రతి నెలా క్రమం తప్పకుండా అందజేస్తున్నాం. మా ప్రభుత్వం మాట నిలబెట్టుకునే ప్రభుత్వం. ప్రజల సంక్షేమం కోసం ‘సూపర్ 6’ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నాం” అని తెలిపారు.
ఇక ప్రభుత్వ కార్యక్రమానికి సంబంధిత అధికారులు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. . ప్రభుత్వ కార్యక్రమాలకు అధికారులు తప్పనిసరిగా హాజరై ప్రజలకు సేవ చేయాలని ఆయన సూచించారు.ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం ఎప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచిపోతుందని, అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరాజు, లీలావతి, మట్టం శ్రావణి, రెడ్డి , కరుణాకర్ రెడ్డి చెంచురామయ్య , దామోదర్, తదితరులు ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు భారీగా హాజరై, ప్రభుత్వంపై తమ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam