సర్వ మానవాళి పాప పరిహారార్థం సిలువలో ప్రాణాలర్పించిన యేసు క్రీస్తు అందరికి ప్రభువు….ఇశ్రాయేల్ కుమార్, అబ్దుల్ రహీం లు*
గూడూరు టౌన్ & రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రైస్తవ సోదరీ, సోదరులు గూడూరు 2వ పట్టణం కోర్ట్ సెంటర్ నుండి గాంధీ నగర్ వరకు రన్ ఫర్ జీసస్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో ముఖ్య అతిధులు గా టీడీపీ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎం.డి. అబ్దుల్ రహీం లు పాల్గొని మాట్లాడుతూ సర్వ మానవాళి పాప పరిహారార్థం యేసు ప్రభువు ముళ్ల కిరీటం ధరించి, కాళ్ళు, చేతులలో మేకులు కొట్టబడి ఆ కలువరి సిలువ లో నలుగగొట్టబడి రక్తం కార్చి గుడ్ ఫ్రైడే నాడు మరణించడం జరిగిందని, మరల 3వ రోజు అనగా ఆదివారం ఈస్టర్ దినాన పునరుత్తానుడై తిరిగి లేచి పరలోకం చేరారని, ఈ సువార్త ను ప్రజలకు చాటి చెప్పేందుకు ఈస్టర్ ముందు రోజు ఈ రన్ ఫర్ జీసస్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, దీనిలో కుల, మతాలకు అతీతం గా అందరు పాల్గొనాలని, యేసు క్రీస్తు అందరికి ప్రభువని, కనుక ప్రతి ఒక్కరు యేసు చూపిన సన్మార్గం లో నడుచుకొని ఆత్మీయ మేలు పొందుకొని శాంతి, సౌభ్రాతృత్వo మెలగాలన్నారు. ప్రపంచంలో నేడు యుద్ధములతో మానవాళి మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుందని, యేసు చూపిన శాంతి మార్గం లో నడుచుకొని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు. అనంతరం పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు మాలవ్య నగర్ సెంటర్ నందు యేసు మరణం మరియు పునరుత్తానం గూర్చి వాక్య సందేశం ఇవ్వగ, గాంధీ నగర్, ఇందిరమ్మ కాలనీ లోని జీవము గల దేవుని సంఘం నందు ముగింపు ప్రార్ధన, ఆశీర్వాదo తో ర్యాలీ ముగించడం జరిగింది. ఈ కార్యక్రమం లో గూడూరు టౌన్ & రూరల్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్సులు బక్కా రత్న శేఖర్, వేల్పుల ప్రభుదాస్,టీడీపీ గూడూరు పట్టణ ఎస్.సి. సెల్ ఉపాధ్యక్షుడు వేల్పుల రమేష్ కుమార్, పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ సభ్యులు దైవసేవకులు డేనియల్ రాజు,కిషోర్ కుమార్, ప్రశాంత్ కుమార్, జయరాజు, ఇస్సాకు, ధన్యాసి విజయకుమార్, వంగేపరపు నాగరాజు, క్రైస్తవ సోదరీ, సోదరులు, సండే స్కూల్ పిల్లలు, యూత్ తదితరులు పాల్గొన్నారు.














