ఘనంగా కొండెపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు

నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో ప్రముఖ పారిశ్రామిక వేత్త, టీడీపీ సీనియర్ నాయకుడు కొండెపాటి గంగా ప్రసాద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాసిం సునీల్ కుమార్ హాజరై, భారీ కేక్‌ను కట్ చేసి గంగా ప్రసాద్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గంగా ప్రసాద్  తనకు దైవసమానులని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నిక కావడంలో గంగా ప్రసాద్  సహాయ సహకారం ఎంతో కీలకమైందని తెలిపారు.గంగా ప్రసాద్ ఎన్నో సంవత్సరాలుగా పార్టీ బలోపేతం కోసం, కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని నాయకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని గంగా ప్రసాద్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam