మహాత్మా జ్యోతిరావు ఫూలే ఆశయ సాధన దిశగా కూటమి

– ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

భారత సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకుని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కుల వివక్ష లేని సమాజం కోసం అణగారిన వర్గాల హక్కుల కోసం ఫూలే చేసిన పోరాటం దేశ చరిత్రలో అజరామరమని కొనియాడారు. ముఖ్యంగా మహిళా విద్యే సామాజిక మార్పుకు మూలమని నమ్మిన ఫూలే, తన సతీమణి సావిత్రిబాయి ఫూలే తో కలిసి చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
మహాత్మా ఫూలే ఆశయాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన మరియు బడుగు, బలహీన వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేస్తోందన్నారు. బలహీన వర్గాలను వెన్నెముకగా భావించే కూటమి ప్రభుత్వం వారి ఆర్థిక మరియు రాజకీయ సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ ఫూలే కలలుగన్న సామాజిక సమానత్వ ఆశయ సాధనకు కృషి చేస్తోందన్నారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన మహాత్మా ఫూలే అడుగుజాడల్లో నడుస్తూ కోవూరు నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు.
సమాజంలోని అసమానతలను రూపుమాపి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడటమే మహాత్మా జ్యోతిరావు ఫూలే గారికి ఇచ్చే నిజమైన నివాళి అని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేర్కొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam