
టీడీపీ తెరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంతి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువదళపతి, రాబోయే తరానికి కాబోయే నాయకుడు, తెలుగు దేశం పార్టీ ని , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లో తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్న శ్రీ నారా లోకేష్ బాబు గారిని తెలుగు దేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మరియు గూడూరు ప్రజల జననేత, మన గూడూరు.. మన సునీల్ అనే నినాదం తో రెండు సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికై, గూడూరు ను అభివృద్ధి పథo లో తీసుకెళుతున్న మా ప్రియతమ శాసన సభ్యులు శ్రీ పాశిo సునీల్ కుమార్ గారిని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా ఎంపిక చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు తెలియచేస్తూ... లోకేష్ బాబు గారికి, పాశిo సునీల్ కుమార్ గారికి గూడూరు నియోజకవర్గ ప్రజల తరపున, తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ తరపున హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నామని టీడీపీ తిరుపతి పార్లమెంట్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర టీడీపీ కమిటీ లో గూడూరు నియోజక వర్గ నాయకులు తెలుగుదేశం పార్టీ సీనియర్లయిన బిల్లు చెంచు రామయ్య కు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గా, మట్టం శ్రావణి రెడ్డి కి రాష్ట్ర కార్యదర్శి గా ఎంపిక చేసి గూడూరు నియోజకవర్గం కు సముచిత స్థానం కల్పించినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, పల్లా శ్రీనివాస రావు గారికి మరియు జిల్లా మంత్రివర్యులకు, సహకరించిన జిల్లా శాసన సభ్యులకు, టీడీపీ అధిష్టానం పెద్దలకు ధన్యవాదములు తెలియచేస్తూ, రాష్ట్ర పదవులకు ఎంపికైన మా సహచరులకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ చేస్తున్నామన్నారు.












