టీడీపీ రాష్ట్ర కమిటీకి ఎంపికైన ఎమ్మెల్యే పాశిం, బిల్లు, మట్టం లకు శుభాకాంక్షలు

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీలో కీలక పదవులకు ఎంపికైన గూడూరు నియోజకవర్గ నేతలను పలువురు టీడీపీ నాయకులు అభినందించారు. ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, బిల్లు చెంచురామయ్య రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, మట్టం శ్రావణి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా నాయకులు వారి నివాసాలకు వెళ్లి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. వారు మాట్లాడుతూ, గూడూరు నియోజకవర్గంలో అధికారం లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ బలోపేతానికి కట్టుబడి పనిచేస్తున్న నాయకులను గుర్తించి ఈ పదవులు కట్టబెట్టడం అభినందనీయమని అన్నారు.సామాజిక న్యాయం పాటిస్తూ ఈ ముగ్గురిని రాష్ట్ర కమిటీలోకి ఎంపిక చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. గూడూరు నియోజకవర్గానికి రాష్ట్ర స్థాయిలో సముచిత ప్రాధాన్యత కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి ఎండీ అబ్దుల్ రహీమ్, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు టి. ఇశ్రాయేల్ కుమార్, క్లస్టర్ కో కన్వీనర్ అరికట్ల మస్తాన్ నాయుడు, యూనిట్ ఇంచార్జ్ తక్కేళ్లపాటి చంద్రమౌళి, 4వ క్లస్టర్ యూనిట్ ఇంచార్జ్‌లు, బూత్ కన్వీనర్లు, వార్డు అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam