నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపిన అట్రాసిటీ కమిటీ సభ్యులు

నూతన సీఐకి శుభాకాంక్షలు తెలిపిన అట్రాసిటీ కమిటీ సభ్యులు

గూడూరు ఏప్రిల్ 24 (ప్రజా వీక్షణం)

నెల్లూరు జిల్లా గూడూరు
గూడూరు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌కు కొత్తగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన మాల కొండయ్య ను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా మరియు గూడూరు డివిజన్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు యేసుపాకు పెంచలయ్య , రావూరు సురేంద్ర అలాగే టిడిపి తెలుగు యువత నాయకులు శ్రీపాదం ఉదయ్ కుమార్ , టిడిపి నియోజకవర్గ కార్యదర్శి అంకిరెడ్డి రమేష్ రెడ్డి కలిసి సీఐ మాల కొండయ్య అభినందించారు.పోలీస్ విభాగంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి, విధుల్లో విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గూడూరు ప్రాంతంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేసి, ప్రజలకు భరోసా కల్పించాలని కోరారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పనిచేసే పోలీసు శాఖకు ప్రజల మద్దతు ఎంతో అవసరమని తెలిపారు. నూతన సీఐ మాల కొండయ్య ప్రజలకు అందుబాటులో ఉంటూ, సమస్యలను సత్వరమే పరిష్కరించేలా కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా సామాజిక న్యాయం పరిరక్షణలో భాగంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరెరు నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన మాల కొండయ్య మాట్లాడుతూ, గూడూరు ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడటంలో ఎలాంటి రాజీ పడకుండా పనిచేస్తానని, ప్రజల సహకారంతో మరింత మెరుగైన పోలీసింగ్ అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam