ఏ.ఐ.టి.యు.సి రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి – నాయకుల పిలుపు

ఈనెల 26 నుండి తిరుపతిలో నిర్వహించనున్న ఏ.ఐ.టి.యు.సి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని గుంటూరు జిల్లా ఏ.ఐ.టి.యు.సి జిల్లా అధ్యక్షులు, హమాలీ ముఠా ఫెడరేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి రావుల అంజి బాబు, నెల్లూరు జిల్లా ఏ.ఐ.టి.యు.సి జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణపిలుపునిచ్చారు.
గుంటూరు నుండి తిరుపతి వరకు వెళ్తున్న జీపు జాతా గూడూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయానికి చేరుకోగా, అక్కడి నుండి ర్యాలీగా బయలుదేరి క్లాక్ సెంటర్ వరకు నిర్వహించారు. గూడూరు ఏ.ఐ.టి.యు.సి నియోజకవర్గ సమితి నాయకులు జాతాకు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్చడం ద్వారా కార్మికులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, వారి సంక్షేమానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులు ఐకమత్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే ఏ.ఐ.టి.యు.సి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్. ప్రభాకర్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి శశి కుమార్, సహాయక నియోజకవర్గ కార్యదర్శి జమాలుల్లా, పట్టణ కన్వీనర్ సునీల్, ఏ.ఐ.టి.యు.సి నియోజకవర్గ అధ్యక్షులు సి.వి.ఆర్ కుమార్, బి.కె.ఎం.యు నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాస మూర్తి, గుంటూరు జిల్లా ఏ.ఐ.టి.యు.సి జిల్లా కార్యదర్శి జి.వి. రాజు, ప్రజా నాట్య మండలి నాయకులు నాగరాజు, రిజ్వాన్, హర్షద్, హఫీజ్, సమ్మాద్, బాలాజీ, దీవెన్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam