నిర్భయంగా అడుగు వేయండి.. అండగా మేముంటాం

నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు

-మహిళల భద్రతే పోలీసుల లక్ష్యం
-నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు
-సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలోమహిళల భద్రతపై అవగాహన సదస్సు

సమాజంలో మహిళలు ఆత్మవిశ్వాసంతో, నిర్భయంగా ముందుకు సాగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమనిమహిళలు వేధింపులకు భయపడి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదని, రక్షణ కవచంలా పోలీసులు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనిమహిళల రక్షణ కోసం ప్రభుత్వం , పోలీస్ యంత్రాంగం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని, ఆపదలో ఉన్న మహిళలకు అండగా ఉండటమే తమ ప్రధాన బాధ్యతని నాయుడుపేట అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, నాయుడుపేట డీఎస్పీ చెంచు బాబు ఆదేశాల మేరకు శనివారం స్థానిక శుభా ఫంక్షన్ హాల్‌లో మీ భద్రత – మా బాధ్యత’ అనే నినాదంతో మహిళా భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు నిర్భయంగా అడుగు వేయండి అండగా మేముంటామని సీఐ వెంకటేశ్వర్లు భరోసా కల్పించారు.మహిళలు తమ ఫోన్లలో తప్పనిసరిగా శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలనిసూచించారు.ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా పోలీసులకు లొకేషన్ షేర్ అవుతుందని, తద్వారా నిమిషాల వ్యవధిలోనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్షణ కల్పిస్తారని భరోసా ఇచ్చారు.మహిళలు ఎక్కడైనా, ఏ సమయంలోనైనా నిర్భయంగా తిరగగలిగే వాతావరణాన్ని కల్పించడమే మా లక్ష్యమని ఎవరైనా వేధింపులకు పాల్పడితే మౌనంగా భరించవద్దు, ధైర్యంగా ఫిర్యాదు చేయాలని చట్టం మీకు పూర్తి రక్షణ కల్పిస్తుందని ఆపద సమయాల్లో డయల్ 100 లేదా పోలీస్ యాప్‌లను ఆయుధాలుగా ఉపయోగించుకోవాలని సమాచారం అందిన నిమిషాల్లోనే పోలీసులు మీ చెంతకు చేరుకుంటామని మేము మీకు ఎల్లవేళలా అండగా ఉంటామని సీఐ వెంకటేశ్వర్లు భరోసా కల్పించారు.
ఎస్సైఎం. శివశంకర్ మాట్లాడుతూ పని చేసే చోట లేదా ప్రయాణాల్లో వేధింపులకు గురైతే మౌనంగా ఉండకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు.కష్టకాలంలో లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు మహిళలు ఎలా రియాక్ట్ అవ్వాలి, అక్కడి నుంచి ఎలా బయటపడాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు.సమాజంలో మహిళలు భయం లేకుండా తిరిగినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమన్నారు.మహిళల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు.మహిళల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యత అని, ఏవైనా సమస్యలు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఎం. శివశంకర్ .కోరారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,మహిళలు, విద్యార్థినులు తదితరులు,పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam