
తిరుపతి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య ఈ రోజు తిరుపతి పార్లమెంటు కమిటీలో నిర్వహణ కార్యదర్శిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనకు ఈ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్య మరియు సమాచార సాంకేతిక శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను తిరుపతి జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యునిగా మరియు తిరుపతి పార్లమెంటు కమిటీలో నిర్వహణ కార్యదర్శిగా నియమించి, పార్టీలో మరియు సమాజంలో గుర్తింపు కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు మరియు ప్రజలందరికీ తనకు అందించిన సహకారం, ప్రోత్సాహానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.













