
గూడూరు: సెన్సెస్–2027 (జనగణన)పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు గూడూరు మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 5కే పరుగును గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాశం .సునీల్ కుమార్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, దేశ అభివృద్ధికి జనగణన ఎంతో కీలకమని, ప్రతి కుటుంబం తమ పూర్తి వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి సరైన ప్రణాళికలు రూపొందించడానికి సహకారం అందుతుందని తెలిపారు. జనగణనలో ప్రజలు ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, సెన్సెస్–2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొన్నారు. జనగణనలో పాల్గొనే ప్రతి వ్యక్తి సరైన సమాచారం ఇవ్వడం ద్వారా ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడూరు Rdo,mro, పట్టణ నాయకులు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుంచి యువత, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని 5కే పరుగులో భాగమయ్యారు.












