
చికెన్ సెంటర్లపై ఆకస్మిక దాడులు
గూడూరు పట్టణంలో పలు చికెన్ దుకాణాలపై అధికారుల తనిఖీలు
గూడూరు పట్టణంలో ఆహార భద్రతపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పట్టణంలోని పలు చికెన్ సెంటర్లపై ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓలు కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా సెంటర్లలో నిల్వ ఉంచిన చికెన్‌ను పరిశీలించిన అధికారులు, పాడైపోయిన చికెన్‌తో పాటు అనారోగ్యానికి దారితీసే పరిస్థితులను గుర్తించినట్లు సమాచారం.
దుకాణ యజమానులను అధికారులు హెచ్చరిస్తూ, పరిశుభ్రత నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. పరిశుభ్రత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
తనిఖీలకు సంబంధించిన నివేదికలు వచ్చిన అనంతరం తదుపరి చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.













