ధరలు పెంచేందుకే పెట్రోల్, డీజిల్ కొరత సృష్టిస్తున్నారు
నాలుగు రోజులుగా పెట్రోల్ బంకుల వద్ద వాహన దారుల పడిగాపులు
కేంద్ర, రాష్ట్ర పాలకులు నిల్వలు ఉన్నాయని బుకాయిస్తున్నారు
సీపీఐ జిల్లా నాయకులు సీహెచ్. ప్రభాకర్, సీవీఆర్. కుమార్ ధ్వజం
వివేకానంద రోడ్డు పెట్రోల్ బంకు ఎదుట ధర్నా
గూడూరు న్యూస్

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని సీపీఐ నాయకులు ధ్వజమెత్తారు. మంగళవారం వివేకానంద రోడ్డులోని పెట్రోల్ బంకు ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు సీవీఆర్. కుమార్ మాట్లాడుతూ దేశంలో యుద్ధం సాకుతో కృత్రిమ కొరత సృష్టించి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచేందుకు చేస్తున్న ప్రయత్నమని ఆరోపించారు. నాలుగు రోజులుగా వాహనాలు పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నాయన్నారు. బాడుగలకు వాహనాలు నడిపే డ్రైవర్లు డీజిల్ లభించక పనులు కోల్పోవలసి వస్తోందన్నారు. అలాగే వ్యవసాయ రంగం కూడా కుదేలవుతోందన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే తగినంత నిల్వలు పెట్రోల్ బంకుల్లో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సీహెచ్. ప్రభాకర్, ఏఐటీయూసీ నియోజకవర్గ అధ్యక్షులు సీవీఆర్. కుమార్, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జీ. శశి కుమార్, సహాయ కార్యదర్శి షేక్ జమాలుల్లా, పట్టణ కన్వీనర్ సునీల్ యాదాల, చిల్లకూరు మండల కార్యదర్శి గుండాల రమేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు సయ్యద్ రిజ్వాన్, హనీఫ్, సమద్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.














