గూడూరు ఆర్డీఓను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా విజిలెన్స్ ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు
గూడూరు, ఏప్రిల్ 28:
రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) సత్యనారాయణను జిల్లా విజిలెన్స్ ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా విజిలెన్స్ ఎస్సీ–ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు ఏసుపాక పెంచలయ్య, రావూరు సురేంద్రలు ఆర్డీఓ సత్యనారాయణకు శాలువ కప్పి ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సభ్యులు పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, ముఖ్యంగా ఎస్సీ–ఎస్టీ వర్గాలకు సంబంధించిన సంక్షేమ అంశాలు, భద్రతా సమస్యలు మరియు ప్రభుత్వ పథకాల అమలు విధానం వంటి పలు అంశాలపై ఆర్డీఓతో చర్చించారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందేలా పరిపాలనలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.
సభ్యుల అభిప్రాయాలను శ్రద్ధగా విన్న ఆర్డీఓ సత్యనారాయణ సానుకూలంగా స్పందించారు. ఎస్సీ–ఎస్టీ వర్గాలకు సంబంధించిన సమస్యలు ఏవైనా ఉన్న యెడల వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు.













