చెన్నూరులో పెన్షన్ పంపిణీ – లబ్ధిదారులకు మట్టం శ్రావణి రెడ్డి భరోసా,


చెన్నూరులో పెన్షన్ పంపిణీ – లబ్ధిదారులకు మట్టం శ్రావణి రెడ్డి భరోసా, ప్రభుత్వ సంక్షేమంపై ప్రశంసలు
గూడూరు మండలం, చెన్నూరు గ్రామం:
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మరియు పార్లమెంట్ మహిళ ప్రధాన కార్యదర్శి  మట్టం శ్రావణి రెడ్డి ఆధ్వర్యంలో చెన్నూరు గ్రామంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఆమె స్వయంగా వృద్ధులు, వికలాంగులు మరియు ఇతర లబ్ధిదారులకు పెన్షన్ అందజేసి వారికి ఆర్థిక భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సమర్థవంతంగా పాల్గొని పంపిణీ ప్రక్రియను సజావుగా నిర్వహించారు. గ్రామ ప్రజలు, లబ్ధిదారులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఆమె మాట్లాడుతూ:ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు మరియు ఆర్థికంగా బలహీన వర్గాలకు పెన్షన్ పథకాలు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయని మట్టం శ్రావణి రెడ్డి పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వం అందించే ప్రయోజనాలు చేరేలా కృషి జరుగుతోందని ఆమె స్పష్టం చేశారు.గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుంటారని, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా అమలు చేస్తూ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆమె ప్రశంసించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం అని అన్నారు.
అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం మరియు అభివృద్ధి సమాంతరంగా కొనసాగుతున్నాయని ఆమె తెలిపారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడంలో సీఎం కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ఇకపై కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి అర్హుడికి చేరవేసేందుకు తమవంతు కృషి కొనసాగుతుందని మట్టం శ్రావణి రెడ్డి హామీ ఇచ్చారు.

error: Content is protected !!
Prajaveek Shanam