
నియోజకవర్గ అభివృద్ధికి PMAGY కింద రూ.60 లక్షలు మంజూరు – ఎమ్మెల్యే పాశిం సునీల్ కుమార్ కృతజ్ఞతలు
గూడూరు:
ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామీణ యోజన (PMAGY) పథకం కింద గూడూరు నియోజకవర్గంలో డ్రైన్లు మరియు త్రాగునీటి (PWS) సదుపాయాల అభివృద్ధికి రూ.60 లక్షలు మంజూరు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శాసన సభ్యులు మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి పాశిం సునీల్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
మీడియాతో మాట్లాడుతూ ఆయన అన్నారు:
నియోజకవర్గంలోని పలు గ్రామాలలో పర్యటించిన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజ్, త్రాగునీటి సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. వెంటనే ఆ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లగా, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులు స్పందించి PMAGY పథకం కింద నిధులు మంజూరు చేశారనివెల్లడించారు.
ప్రాంతాల వారీగా మంజూరైన నిధులు ఇలా ఉన్నాయి:గూడూరు మండలం – చెమిర్తి పంచాయతీ: డ్రైన్ల నిర్మాణానికి రూ.20 లక్షలుచిల్లకూరు మండలం – పల్లమాల పంచాయతీ: పైప్లైన్ మరియు డ్రైన్ పనులకు రూ.20 లక్షలు
వాకాడు మండలం – జమీన్ కొత్తపాలెం పంచాయతీ: CC డ్రైన్లకు రూ.20 లక్షలు
చిట్టమూరు మండలం – ఉప్పలమర్తి పంచాయతీ: RO ప్లాంట్, సోలార్ లైట్స్, డ్రైన్ల ఏర్పాటుకు రూ.20 లక్షలు
నియోజకవర్గంలో డ్రైనేజ్ మరియు త్రాగునీటి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నందుకు ప్రధాన మంత్రి గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, పంచాయతీ రాజ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మారుతాయని, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కలుగుతాయని ఆయన అన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.













