
గూడూరు నియోజకవర్గం, చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో రద్దు చేసిన సీజేఎఫ్ఎస్ భూములకు డీకేటి పట్టాల మంజూరు ప్రక్రియలో భాగంగా రెవిన్యూ గ్రామసభను నిర్వహించారు. గౌరవ గూడూరు ఎమ్మెల్యే మరియు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం జరిగింది.
పెంచలకోన దేవస్థానం మాజీ చైర్మన్ తానంకి నానాజీ గారి సహకారంతో, మండల పార్టీ అధ్యక్షుడు దువ్వూరు రాజశేఖర్ రెడ్డి, తహసీల్దార్ గోపినాధ్ రెడ్డి సమక్షంలో, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నెలటూరు చిరంజీవి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు, నాయకులు మాట్లాడుతూ—ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవానికి చట్టపరంగా భూమి పంపిణీ చేయడమే లక్ష్యమని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులందరికీ సమన్యాయం చేస్తామని తెలిపారు. లబ్ధిదారుల అభిప్రాయాలను స్వీకరించి, ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన వెంటనే డీకేటి పట్టాలను స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేస్తామని వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తిక్కవరం మాజీ సర్పంచ్ ఓడూరు సతీష్ రెడ్డి, గూడూరు ఏఎంసీ డైరెక్టర్ నెలటూరు సుప్రజ, గ్రామ పార్టీ అధ్యక్షుడు కందల శ్రీనివాసులు, మండల సర్వేయర్ మల్లికార్జున్, ఆర్ఐ పూర్ణచంద్ర, వీఆర్వో బూదాటి శ్రీనివాసులు, స్పెషల్ ఆఫీసర్ ఫరూక్, సచివాలయం సర్వేయర్ అచ్యుత్, వివోఏ పోలూరు మౌనికతో పాటు పార్టీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో సీజేఎఫ్ఎస్ లబ్ధిదారులు పాల్గొన్నారు.













