. సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్ ప్రభాకర్ , ఏ. ఐ.టి.యు .సి జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణ.

గూడూరు మే 16: కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ , డీజిల్ రేట్లను వెంటనే తగ్గించాలని సి.హెచ్.ప్రభాకర్ , ఏ.ఐ.టి. యు.సి జిల్లా అధ్యక్షులు కొమ్మి నారాయణ లు పేర్కొన్నారు. శనివారం గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ వద్ద సీపీఐ, ఏ. ఐ .టి. యు.సి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ 12 సంవత్సరాలుగా దేశ ప్రజల పైన పెట్రోల్ , డీజిల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజల పై మోయలేని భారాలను వేశారని పేర్కొన్నారు.ప్రజల దృష్టిని మరల్చడంకోసం జాతీయ భావం, మతం ముసుగులో ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు పెరిగిన పెట్రోల్ , డీజిల్ వలన నిత్యవసర సరుకులు పెరిగి సామాన్యుల పై భారం పడిందన్నారు. పూర్తిగా రవాణా రంగం అస్తవ్యస్తం అయిందన్నారు. ఇకనైనా పెంచిన పెట్రోల్ , డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి.శశి కుమార్ , సీపీఐ పట్టణ కన్వీనర్ సునీల్ , చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్,
, రాఘవులు , వెంకటయ్య , రిజ్వాన్, మోహన్ , వెంకటేశ్వర్లు , హఫీజ్ , తదితరులు పాల్గొన్నారు.












