వెంకటగిరి పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం:

వెంకటగిరి పట్టణాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దడమే మన లక్ష్యం:

ఎమ్మెల్యే కురుగొండ్ల…

వెంకటగిరి, మే16

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల పిలుపు మేరకు “స్వచ్ఛ ఆంధ్ర – ప్లాస్టిక్ రహిత రాష్ట్రం” సాధనలో భాగంగా వెంకటగిరి పట్టణ పరిధిలో శనివారం భారీ అవగాహన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో వెంకటగిరి శాసనసభ్యులు శ్రీ కురుగొండ్ల రామకృష్ణ స్వయంగా పాల్గొని ప్రజలకు, వ్యాపారులకు ప్లాస్టిక్ నిర్మూలనపై దిశానిర్దేశం చేశారు.భావి తరాలకు ప్లాస్టిక్ వాడకం ద్వారా ఎంత ప్రమాదమో తెలియజేసారు.
​స్థానిక మార్కెట్ వీధుల్లో పర్యటించిన ఎమ్మెల్యే కురుగొండ్ల కూరగాయలు, పండ్ల వ్యాపారులతో నేరుగా మాట్లాడారు. వారు వాడుతున్న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లను పక్కనపెట్టించి, తన వెంట తెచ్చిన జనపనార/గుడ్డ సంచులను (క్లాత్ బాగ్స్)ను వారికి పంపిణీ చేశారు. ప్లాస్టిక్ కవర్లలో ఆహార పదార్థాలు వదిలేయడం వల్ల వాటిని తిని మూగజీవాలు (ఆవులు) ప్రాణాలు కోల్పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
​
ప్లాస్టిక్ వద్దు – గుడ్డ సంచే ముద్దు:

ప్రతి ఒక్కరూ మార్కెట్ కు వచ్చేటప్పుడు ఇంటి నుంచే గుడ్డ సంచిని తెచ్చుకోవాలని, ఇకపై మున్సిపాలిటీలో ప్లాస్టిక్ వాడితే జరిమానాలు తప్పవని తెలిపారు.
​ఇళ్లలో వచ్చే చెత్తను ఎక్కడపడితే అక్కడ రోడ్లపై వేయకూడదని తెలిపారు. మున్సిపాలిటీ చెత్త బండ్లకు మాత్రమే చెత్తను అందించాలని తెలిపారు.

​ ప్రతి 3వ శనివారం ప్లాస్టిక్ ఫ్రీ డే:

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి నెలా 3వ శనివారాన్ని ప్లాస్టిక్ రహిత దినోత్సవంగా పాటించాలని ఎమ్మెల్యే తెలిపారు.
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, స్థానిక అవసరాల కోసం కార్లు, బైకులు వాడటం తగ్గించి సైకిళ్లను వినియోగించడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల డబ్బు ఆదా అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు.పార్టీ మహానాడు కార్యక్రమాలను సైతం ఇంధన ఆదా కోసమే వర్చువల్ గా నిర్వహించుకుంటున్నామని ఆయన గుర్తుచేశారు.వెంకటగిరిని స్వచ్ఛమైన నియోజకవర్గంగా మార్చేందుకు ప్రజలందరూ అధికారులకు సహకరించాలని ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఏ. యం. సి చైర్మన్ మురుగ , పట్టణ అధ్యక్షులు అవ్వారు సత్యం , మాజీ ఏ. యం. సి చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బీరం రాజేశ్వరరావు , మాజీ పట్టణ అధ్యక్షులు మంకు ఆనంద్ , పట్టణ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam