ఘనంగా శ్రీ తిరుపతి గంగమ్మ తల్లి జల్ది కార్యక్రమం


పలమనేరు మే 16

: గత నెల 30వ తేదీ గంగమ్మ చాటు నిర్వహించారు. అప్పటినుండి ఒక్కో కులస్తులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ క్రమంలో మే 14 వ తేదీ గంగమ్మ శిరస్సు మెరవని, 15వ తేదీ గంగమ్మ తల్లి విశ్వరూప దర్శనం, మే 16వ తేదీ గంగమ్మ తల్లిని జల్దీకి తరలించారు. గత 16 రోజులుగా గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ పాలక వర్గ సభ్యులు అందరూ కలసి మెలసి గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించారు. అందులో భాగంగా గంగమ్మ తల్లికి తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి నుండి ప్రత్యేక పూలు తీసుకొచ్చి గంగమ్మకు అలంకరణలు చేపట్టారు. గంగమ్మ తల్లి ఒక్కో రోజు భక్తులకు దర్శనాలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మారెమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం గంగమ్మకు పుట్టింటి నుండి సారెను సాంప్రదాయ బద్ధంగా నిర్వహించారు. పోలీసులు గంగమ్మ జాతరకు 300 మంది పోలీసులను ఏర్పాటు చేశారు ఇందులో డిఎస్పి డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో పండుగ లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా పలమనేరు అర్బన్ సిఐ మోహన్ రెడ్డి గంగవరం సీఐ రాంభూపాల్, ఎస్సై లోకేష్ రెడ్డి, ఎస్సై స్వర్ణ తేజ, వీరందరూ కలసి గంగమ్మ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి ప్రత్యేకంగా పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం గంటవూరు బీసీ కాలనీ నందు నివాసం ఉంటున్న స్వర్ణ నంది అవార్డు గ్రహీత, డాక్టర్ మురుగన్ కు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ తో పాటు పాలకవర్గ సభ్యులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం శ్రీ తిరుపతి గంగమ్మ జాతరను విజయవంతంగా నిర్వహించినందుకు ప్రజలకు గంగమ్మ గుడి చైర్మన్ శ్రీధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

error: Content is protected !!
Prajaveek Shanam