పలమనేరు మే 16
: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర లో భాగంగా ప్రతి నెల ప్రతి మూడవ శనివారం పారిశుద్ధ్య నిర్వహణ నిర్వహించాలని ఆదేశించారు. పలమనేరు పురపాలక సంఘ కార్యాలయం నుండి అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి మాట్లాడుతూ…. ప్రజలందరూ ప్లాస్టిక్ బదులు బట్ట సంచులను పేపర్ సంచులను వినియోగించాలని తెలిపారు. నివాసాలలో జరిగే శుభకార్యాలకు ప్లాస్టిక్ ప్లేట్లు గ్లాసులు బదులు స్టీల్ పునర్వినియోగ పాత్రలను మాత్రమే వినియోగించాలని కోరారు. ఇంటి వద్ద ఉత్పత్తి అయ్యే చెత్తను పారిశుద్ధ కార్మికులు మీ ఇంటి కీ వచ్చినప్పుడు వారికి మాత్రమే అందించాలని తెలిపారు. హోమ్ కంపోస్టింగ్ ను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. పలమనేరు పురపాలక సంఘం మెప్మా వారి సహకారంతో సహకారంతో తయారుచేసిన జూట్ బ్యాగులను వీధి విక్రయ దారులకు అందించాలన్నారు. పురపాలక సంఘ కార్యాలయం నందు పట్టణ ప్రజలచే స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. పెద్ద చెరువు పరిసర ప్రాంతాల యందు పూడికతీత పనులను పరిశీలించి పారిశుద్ధ్య కార్మికులకు తగు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మున్సిపల్ మేనేజర్ ఖాదర్ మోహిద్దీన్, సానిటరీ ఇన్స్పెక్టర్ బాబు రెడ్డి నాయక్, మెప్మా సీ.ఎం ఏం,బాబా, పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు, ఆర్పీలు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.













