పలమనేరు మే 16
: జాతీయ డెంగ్యూ దినోత్సవ సందర్భంగా యుపిఎస్సి పాతపేట మరియు పిఎస్సి గంగవరం లలో డాక్టర్ మౌనిక డాక్టర్ శ్రీనివాసులు, ఆధ్వర్యంలో సబ్ యూనిట్ అధికారి జయశంకర్ పర్యవేక్షణలో ర్యాలీలు, ప్రతిజ్ఞ చేయించారు. ఇందులో భాగంగా డెంగ్యూ నివారణలో సమాజం భాగస్వాములు తప్పనిసరి అను నినాదమును ప్రజలలో తీసుకెళ్లాలని అలాగే పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతలు పెట్టండి చెక్, క్లీన్, కవర్ అనే విషయాలో ప్రజలు అవగాహన కలిగి మంచినీటి నిల్వలుమురికి నీటి నిలువలు లేకుండా ఇంటి చుట్టుప్రక్కల పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇలాంటి సందేశాలను ముఖ్యంగా యువతీ యువకులు సమాజ బాధ్యతగా వహించి బాధ్యతగల పౌరులుగా ఉండాలని ప్రతి ఒక్కరూ ఇంకొకరికి పరిశుభ్రత విషయంలో ఆదర్శంగా ఉండాలని సూచించి పురవీధులకుండా ర్యాలీ నిర్వహించడం జరిగినదన్నారు. ప్రజలు ఆరోగ్య సిబ్బంది చే ప్రతిజ్ఞ చేయించి అటు దిశగా ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని తెలియజేయడం జరిగినదన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది కుసుమకుమారి, జ్యోతి ఈశ్వర్, బలరాం, రవి, ఆశలు భార్గవి కైరున్ నాగ మణి,సుజాత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.













