మంగళగిరి టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నందు ఈ నెల 22, 23 తేదీలలో యూనిట్ ఇంచార్జ్‌లకు నిర్వహిస్తున్న ప్రత్యేక శిక్షణ తరగతులకు టీడీపీ అధిష్టానం ఆదేశాల మేరకు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారి సూచనలతో గూడూరు నియోజకవర్గానికి చెందిన యూనిట్ ఇంచార్జ్‌లు నేడు హాజరయ్యారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో పార్టీ బలోపేతం, గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం, ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల వివరాలు చేరవేయడం, క్షేత్రస్థాయిలో నాయకులు మరియు కార్యకర్తలు సమన్వయంతో పని చేసే విధానంపై పార్టీ సీనియర్ నాయకులు పలు అంశాలపై మార్గదర్శనం చేశారు.
అలాగే పార్టీ అభివృద్ధి, భవిష్యత్ కార్యాచరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, సోషల్ మీడియా వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారంలో యూనిట్ ఇంచార్జ్‌ల పాత్ర వంటి అంశాలపై కూడా ప్రత్యేక అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గూడూరు నియోజకవర్గం నుండి హాజరైన యూనిట్ ఇంచార్జ్‌లు పార్టీ అధిష్టానం చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని తెలిపారు.













