
కందుకూరు నియోజకవర్గం
తెలుగుదేశం పార్టీ మహానాడు సన్నాహక కార్యక్రమాల్లో భాగంగా కందుకూరు నియోజకవర్గ పరిశీలకులుగా రాష్ట్ర పార్టీ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని ఆమె మర్యాదపూర్వకంగా కలిసి, మహానాడు ఏర్పాట్లు, క్లస్టర్ వారీగా జరుగుతున్న సమీకరణ కార్యక్రమాలు, కార్యకర్తల సమన్వయం, నియోజకవర్గ స్థాయి ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల పాల్గొనడం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించి వివరాలు తెలుసుకున్నారు.
మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి మండలం, ప్రతి గ్రామం నుంచి భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి మహానాడు తెలుగు తమ్ముళ్లకు ఒక పసుపు పండుగగా కొనసాగుతోందని, ఈసారి కూడా అదే ఉత్సాహంతో నిర్వహించేందుకు అందరూ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ…“నాపై నమ్మకం ఉంచి కందుకూరు నియోజకవర్గ పరిశీలకురాలిగా బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారికి, అలాగే మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ ఇచ్చిన ప్రతి బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తూ మహానాడు విజయవంతానికి నా వంతు కృషి పూర్తి స్థాయిలో చేస్తాను” అని అన్నారు.అదేవిధంగా పార్టీ బలోపేతానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని, మహానాడు ద్వారా పార్టీ సిద్ధాంతాలు మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆమె పిలుపునిచ్చారు.












