మహానాడు విజయవంతానికి విస్తృత ఏర్పాట్లు – సన్నాహక కార్యక్రమాలను పర్యవేక్షించిన రాష్ట్ర పార్టీ కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి


కందుకూరు నియోజకవర్గంలో ఈ నెల 27, 28 తేదీలలో ఘనంగా నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాల విజయవంతానికి చేపడుతున్న ఏర్పాట్లను రాష్ట్ర పార్టీ కార్యదర్శి మరియు కందుకూరు నియోజకవర్గ పరిశీలకులు మట్టం శ్రావణి రెడ్డి సమగ్రంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు ఇంటూరి నాగేశ్వరరావు గారితో కలిసి మహానాడు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
కార్యక్రమ స్థలాల పరిశీలన, వేదికల నిర్మాణం, పార్కింగ్, తాగునీరు, విద్యుత్, భద్రత, కార్యకర్తల రాకపోకలు, వసతి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మహానాడుకు భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత నాయకులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మట్టం శ్రావణి రెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి మహానాడు ఒక పసుపు పండుగలాంటిదని, పార్టీ బలోపేతానికి మరియు భవిష్యత్ కార్యాచరణకు మహానాడు వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త మహానాడు విజయవంతానికి బాధ్యతగా పనిచేసి పార్టీ ప్రతిష్టను మరింత పెంచాలని పిలుపునిచ్చారు.
అలాగే ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ, కందుకూరు నియోజకవర్గం తరఫున మహానాడుకు భారీ ఎత్తున కార్యకర్తలు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. పార్టీ అధినేతల ఆశయాలకు అనుగుణంగా మహానాడును విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam