
గూడూరు నియోజకవర్గం :
గూడూరు పట్టణంలోని గమళ్లపాలెం ప్రాంతంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి విగ్రహం సమీపంలో ఏర్పాటు చేసిన ఆధునిక IMAX ల్యాంప్లను గూడూరు శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు మాట్లాడుతూ, గూడూరు పట్టణాన్ని మరింత ఆధునికంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రహదారి వెలుగులు అందించేందుకు ప్రత్యేక ప్రణాళికతో IMAX లైట్ల ఏర్పాటు చేపడుతున్నామని తెలిపారు.గమళ్లపాలెం మరియు ఇందిరానగర్ ప్రాంతాల్లో రూ.3 లక్షల 10 వేల వ్యయంతో IMAX ల్యాంప్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే రాపూరు రోడ్లో పెండింగ్లో ఉన్న పనులను రూ.7 లక్షలతో పూర్తి చేశామని పేర్కొన్నారు.ఇప్పటికే అశోక్ నగర్ సెంటర్, సాదుపేట సెంటర్, బణిగిసాహెబ్పేట మరియు 2 టౌన్ ప్రాంతాల్లో రూ.8 లక్షల వ్యయంతో IMAX లైట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఈ రెండు సంవత్సరాల కూటమి ప్రభుత్వ పాలనలో మొత్తం రూ.18 లక్షల 10 వేల రూపాయల వ్యయంతో గూడూరు పట్టణంలో ఆధునిక IMAX లైట్లను ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించామని ఎమ్మెల్యే తెలిపారు.
గూడూరు పట్టణ అభివృద్ధికి మరిన్ని పనులు చేపట్టి ప్రజలకు అన్ని విధాలా మౌలిక వసతులు అందించేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, మున్సిపల్ ప్రతినిధులు, స్థానిక ప్రజలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.












