గూడూరులో ఘనంగా మహానాడు–2026 వేడుకలు

గూడూరు పట్టణం:- రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు – 2026 కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని PVR కల్యాణ మండపం నందు ఘనంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్రీ పాశిం సునీల్ కుమార్  పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపారు.
ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవ ప్రతీక స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) గారి విగ్రహానికి నాయకులు, బూత్ కన్వీనర్లు, పార్టీ కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఎన్టీఆర్ గారి సేవలను స్మరించుకుంటూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు.అనంతరం మహానాడు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్ర స్థాయి నాయకత్వం జూమ్ ద్వారా నిర్వహించిన సమావేశంలో పాల్గొని పార్టీ భవిష్యత్ కార్యాచరణ, గ్రామస్థాయి బలోపేతం, సభ్యత్వ నమోదు, మహానాడు విజయవంతం చేసే అంశాలపై చర్చించారు. సమావేశంలో పార్టీ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో టీడీపీ మరింత బలపడేందుకు ప్రతి కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ సిద్ధాంతాలను తీసుకెళ్లాలని డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు సూచించారు. మహానాడు కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇంచార్జ్‌లు, యువ నాయకులు, మహిళా నాయకులు మరియు భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

error: Content is protected !!
Prajaveek Shanam