
ఈ రోజు(29-05-26)లో భాగంగా నిర్వహిస్తున్న MLA CUP-2026 హాకీ టోర్నమెంట్‌ను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేసి, క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, ఆరోగ్యాన్నిపెంపొందిస్తాయనిపేర్కొన్నారు.టోర్నమెంట్‌లో పాల్గొన్న వివిధ జట్ల ఆటగాళ్లు ఉత్సాహంగా పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటారు. స్థానిక నాయకులు, క్రీడాభిమానులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ యువత క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించుకోవాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు నాయకత్వ లక్షణాలను కూడా అభివృద్ధి చేస్తాయని అన్నారు. MLA CUP-2026 వంటి టోర్నమెంట్‌లు గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులకు మంచి అవకాశాలు కల్పిస్తాయని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తితో ఆడి ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.












