మహానాడులో క్రైస్తవుల సంక్షేమ తీర్మానం ప్రవేశపెట్టిన నేతలు


నెల్లూరు జిల్లా, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని గూడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన మహానాడులో క్రైస్తవుల సంక్షేమానికి సంబంధించిన కీలక తీర్మానం ప్రవేశపెట్టబడింది.ఈ సందర్భంగా గూడూరు మాజీ కౌన్సిలర్, గూడూరు 4వ క్లస్టర్ 15వ యూనిట్ ఇంచార్జ్ మరియు తిరుపతి పార్లమెంట్ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ క్రైస్తవుల పక్షాన మాట్లాడుతూ, ప్రతి నియోజకవర్గానికి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ భవనం, ప్రతి జిల్లాకు ఒక బైబిల్ ట్రైనింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే జిల్లా, రాష్ట్ర స్థాయిలో పార్టీ కోసం చురుకుగా పనిచేస్తున్న క్రైస్తవ సోదరులకు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో వారి దామాషా ప్రకారం అవకాశాలు కల్పించాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ఈ తీర్మానాన్ని గూడూరు 7వ యూనిట్ ఇంచార్జ్ తక్కెళ్లపాటి చంద్రమౌళి బలపరచగా, స్థానిక శాసనసభ్యులు మరియు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు మద్దతు తెలిపి పార్టీ అధిష్టానానికి పంపించారు.ఈ తీర్మానం పట్ల క్రైస్తవ సోదరులు దేవుని నామమున హర్షం వ్యక్తం చేస్తూ, గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారికి, తిరుపతి పార్లమెంట్ టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు తాతపూడి ఇశ్రాయేల్ కుమార్ గారికి, గూడూరు 7వ యూనిట్ ఇంచార్జ్ తక్కెళ్లపాటి చంద్రమౌళి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

error: Content is protected !!
Prajaveek Shanam