
గూడూరు పట్టణంలోని దివ్య ఫంక్షన్ హాల్లో సోమవారం నిర్వహించిన గూడూరు మునిసిపల్ కమిషనర్ శ్రీ ఎ. వెంకటేశ్వరరావు పదవీవిరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గూడూరు శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పాశిం సునీల్ కుమార్ గారు, శ్రీమతి సంధ్యారాణి గారితో కలిసి హాజరై కమిషనర్ దంపతులను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పాశిం సునీల్ కుమార్ మాట్లాడుతూ, కమిషనర్ వెంకటేశ్వరరావు పట్టణ అభివృద్ధికి విశేష కృషి చేశారని, వారి సేవలు గూడూరు ప్రజలకు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన పదవీకాలంలో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యాయని, ఇంకా కొంతకాలం సేవలందించే అవకాశం ఉంటే మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేవారని అన్నారు. ఇలాంటి సమర్థవంతమైన అధికారి పదవీవిరమణ చేయడం బాధాకరమని అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో పెంచలకోన ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పట్టణ ప్రముఖులు పాల్గొని కమిషనర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు.













